Prof. Kodali Srinivas' writings
ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్ - రచనలు
1.వాస్తు విద్య
For copies :
Rayal Civil Publications,
GUNTUR - 522006
ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్ - రచనలు
1.వాస్తు విద్య
(బృహత్ సంహితా భాగానికి విస్లేషణాత్మక తెలుగు అనువాదం -2007)
వరాహ మిహిరుని చే ఆరోవ శతాబ్దం లో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహితలోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. తెలుగు లో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. తెలుగులో ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది .
2. వాస్తు లో ఏముంది?
వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997
VAASTHULO EMUNDI ?
లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు . చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యంఅంటారు.నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు ,అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వాస్తును అనేకమంది అవగాహనారహిత్యంతో అతిగాఆచరిస్తున్నారు .
ఈశాన్నం లో నుయ్యి ,ఆగ్నేయంలో పొయ్యి ...వాస్తు అంటే ఇదే అనే భ్రమను తొలగించి వాస్తవాన్ని మీముందు ఉంచుతుంది .సాంకేతిక దృష్టితో పరిశీలన జరుపుటవలన శాస్త్రి యమైన వాస్తు ఫై స్పష్టమైన అవగాహనను కలుగజేస్తుంది .వాస్తు ఫై నమ్మకం ఉన్నా లేకున్నా ప్రతివారు చదువవలసిన గ్రంథం. నిజంగా వాస్తులో ఏముందో తెలుసుకోవాలనుకునే వారికి ఈ గ్రంధం ఉపకరిస్తుంది .
3. వాస్తు లో వాస్తవాలు
మెరిసేదంతా బంగారం ఎలాకాదో అలాగే ఈనాడు వాస్తు పేరుతొ చెప్పేవన్ని వాస్తవాలు కావు .నేడు వాస్తు పేరుతొ అనేక విషయాలు వాస్తవాలుగా వర్దిల్లుతున్నాయి.నిజంగా వాస్తులో వాస్తవాలు తెలుసుకోవాలనేవారికి ఈ పుస్తకం మార్గదర్శకంగా ఉపకరిస్తుంది. ప్రాచీన - అర్వాచీన వాస్తుగ్రంధాలను క్షుణ్ణంగా పరిశోధించి, వాస్తులోని వాస్తవాలాను వెలికితీసిన పరిశీలనా గ్రంధం ఇది.
వాస్తు శాస్త్రాన్ని సాధికారికంగా పరిశీలించి, దానిలోని దోషాలను దాపరికం లేకుండా వివరించినందువల్ల , వాస్తుఫై ఒక అవగాహన కలుగజేస్తుంది .అనవసరపు ఆందోళనతో వాస్తు మరమ్మతులు చేసే ముందు తప్పనిసరిగా చదువవలిసిన గ్రంధం ఇది.
4. తూర్పు - పడమర
TURPU - PADAMARA
ఆంధ్ర జ్యోతి దినపత్రిక లో ఏప్రిల్ 2006- 2007ఏప్రిల్ వరకు ఆదివారం ప్రచురించ బడిన వ్యాసాలు మరియు పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు. త్వరలో పుస్తకరూపంలో వస్తుంది.
For copies :
Rayal Civil Publications,
GUNTUR - 522006
Comments
Post a Comment